Vennela Kishore Latest Movie Chaari 111: ‘వెన్నెల’ కిశోర్ కథానాయకుడిగా బర్కత్ స్టూడియోస్ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ హీరోగా నటించిన హిట్ సినిమా ‘మళ్ళీ మొదలైంది’ తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఇందులో ‘వెన్నెల’ కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీ శర్మది ప్రధాన పాత్ర. తాజాగా సినిమాను ప్రకటించడంతో పాటు కాన్సెప్ట్ టీజర్ కూడా విడుదల చేశారు.
పూర్తిగా చదవండి..Vennela Kishore: వెన్నెల కిషోర్ హీరోగా కామెడీ సినిమా
వినోదానికి కేరాఫ్ అడ్రస్ 'వెన్నెల' కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు. కామెడీలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. ఇప్పుడీ హాస్య నటుడు మరోసారి హీరోగా మారాడు. 'వెన్నెల' కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'చారి 111'.

Translate this News:











