Vande Bharat Express: ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) వర్చువల్ గా ప్రారంభించిన వందే భారత్ ట్రైన్(Vande Bharat Train) కాచిగూడ నుండి పాలమూరు పట్టాల పైకి రయ్ రయ్ మంటూ దూసుకొచ్చింది. ఈ వందే భారత్ ట్రైనుకు బిజెపి(BJP) నాయకులు ఘన స్వాగతం పలికారు. పాలమూరు రంగారెడ్డి ట్రైన్ ప్రత్యేకతల పై RTV స్పెషల్ స్టోరీ. పాలమూరు జిల్లాకు వందే భారత్ ట్రైన్ రావడంతో ట్రైన్ ను చూసేందుకు, ఎక్కేందుకు స్థానికులు పెద్ద ఎత్తున మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఎన్నో అద్భుతమైన ఫ్యూచర్స్ తో గుడ్ లుకింగ్ తో ఉన్న వందే భారత్ ట్రైన్ ను ఎక్కిన ప్రయాణికులు చాలా అనుభూతి చెందుతున్నారు. పట్టాలపై ప్రయాణించే ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నట్లు ఉందని తెలుపుతున్నారు..
పూర్తిగా చదవండి..Vande Bharat Express: పాలమూరు పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ రైలు..
ఒకప్పుడు వలసల జిల్లా, వెనకబడిన జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లా మీదుగా వందే భారత్ రైలు పరుగులు పెట్టడం జిల్లా ప్రజల అదృష్టం అని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలోనే మహబూబ్ నగర్ కు డబ్లింగ్ లైన్ పూర్తి చేసిన రైల్వే శాఖ.. మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ సుందరీకరణ కు కూడా కోట్ల రూపాయలను మంజూరు చేసింది.

Translate this News:











