Vaishnavi Chaitanya: బేబీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తర్వాత నటి వైష్ణవి చైతన్యకి ఇతర హీరోయిన్లలా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఎట్టకేలకు ఆమె బిజీ అయింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఇప్పుడు కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రాబోయే సినిమాలో వైష్ణవి హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఈ మేరకు చర్చలు సాగుతున్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు శిరీష్‌కి జోడీగా కూడా కొత్త చిత్రంలో నటించనుందని సమాచారం.
పూర్తిగా చదవండి..Vaishnavi Chaitanya: మొన్నటివరకు ఫ్రీ.. ఒక్కసారిగా బిజీ
జూలైలో విడుదలైన బేబీ అనే చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా యూత్ ను కట్టిపడేసింది. మరీ ముఖ్యంగా వైష్ణవి చైతన్య, తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ వెంటనే ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తాయని అంతా భావించారు. ఎట్టకేలకు ఆమెకు సరైన అవకాశాలు వస్తున్నాయి.

Translate this News:













