ఖమ్మం జిల్లా: వైరా రిజర్వాయర్‌కు వెళ్లి రహదారి విస్తరణ పనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మున్సిపాలిటీలోని పాలకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులకు సంబంధించిన షాపులు తొలగించకుండా.. అక్రమంగా ఒక వైపే తొలగించారని గత రెండు, మూడు రోజుల నుంచి అఖిలపక్ష నాయకులు ఆధ్వర్యంలో ఆందోళనలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాములు నాయక్ అఖిలపక్షం నాయకులు కలిసి సమావేశం నిర్వహించారు.
పూర్తిగా చదవండి..Vaira MLA camp: వివాదంలో వైరా రిజర్వాయర్ విస్తరణ పనులు..బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య వాగ్వాదం
వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అఖిలపక్ష నాయకులతో జరుగుతున్న సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయ భాయ్‌పై ఎమ్మెల్యే రాములు నాయక్ విరుచుపడ్డారు. కార్యాలయంలో వద్ద గందరగోళంతో బీఆర్ఎస్-కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారటంతో పోలీసులు ఇరువురిని శాంతిప చేశారు.

Translate this News:











