ఈ మధ్యకాలంలో సహజీవనం చేయడం అనేది సాధారణం అయిపోయింది. విదేశాలతో సహా భారత్లో కూడా చాలామంది లీవ్ ఇన్ రిలేషన్షిప్ వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇలా సహజీవనం చేసే జంటలో కొందరు సంతోషంగా గడిపిన తర్వాత వివాహం చేసుకుంటున్నారు. మరికొందరు ఒకరినొకరు అర్ధం చేసుకోలేక, సర్ధుకోలేక విడిపోతున్నారు. అలాగే ఈ మధ్య ఇలా సహజీవనం చేసే వారిలో హత్యలు లాంటివి జరిగిన సంఘటనలు కూడా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఢిల్లీలోని శ్రద్ధావాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత మరికొన్ని దుర్ఘటనలు కూడా జరిగాయి. అయితే ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఓ దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని చూసి ఆయన కొడుకులు అతనిపై కిరాతకానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఉత్తరప్రదేశ్లోని అమ్రోదా అనే పట్టణంలో రామ్ ప్రకాశ్ ద్వివేది(83), అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30) కలిసి ఉంటున్నారు. అయితే విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం చేయడాన్ని చూసి అతడి కొడుకులు తట్టుకోలేకపోయారు. ఈ విషయంలో వారి కుటుంబంలో తరుచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Live in Relationship: 30 ఏళ్ల మహిళతో సహజీవనం చేస్తున్న తండ్రి.. కొడుకులు ఏం చేశారో తెలిస్తే షాక్
ఉత్తరప్రదేశ్లోని ఓ దారుణం వెలుగుచూసింది. ఓ తండ్రి మరో మహిళతో సహజీవనం చేయడాన్ని చూసి ఆయన కొడుకులు అతనిపై దాడికి పాల్పడ్డారు.అమ్రోదా అనే పట్టణంలో రామ్ ప్రకాశ్ ద్వివేది(83),అతని కుమారుడు విమల్(63), అతని భాగస్వామి ఖుష్బు(30) కలిసి ఉంటున్నారు. అయితే విమల్ 30 ఏళ్ల మహిళతో కలిసి సహజీవనం చేయడాన్ని చూసి అతడి కొడుకులు తట్టుకోలేకపోయారు. తాజాగా వారి మధ్య గొడవ జరగడంతో.. కొడుకులు తాతా, ఖుష్బును కత్తితో పొడిచి హత్య చేశారు. తండ్రి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Translate this News:











