People behind Chandrayaan mission success: చంద్రయాన్-3 సూపర్ సక్సెస్ అయ్యింది. జాబిల్లి దక్షిణ ధృవంపై కాలు మోపిన ల్యాండర్ కొత్త చరిత్ర సృష్టించింది. గతంలో మరే దేశం కూడా చంద్రుడి దక్షిన ధృవంపై కాలు మోపలేదంటే తాజాగా ఇస్రో సాధించిన గెలుపు ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. నాలుగేళ్ల క్రితం ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డ చంద్రయాన్-2 నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో సైంటిస్టులు తాజాగా చంద్రయాన్-3తో గెలుపు రుచి చూడడంతో యావత్ దేశం సంబరాల్లో మునిగిపోయింది. దేశంలోని ప్రతి పౌరుడు ఇస్రో విజయాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నాడు. స్వీట్లు పంచుకుంటున్నారు.. ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. ఈ ఒక్క గెలుపుతో ఇండియాలో హ్యాపీనెస్ ఇండెక్స్ ర్యాంక్ పెరిగే ఉంటుంది.. దేశం మొత్తాన్ని ఇంత ఆనందపరిచిన చంద్రయాన్-3 ప్రయోగం వెనుక హీరోలు ఎవరు?
పూర్తిగా చదవండి..Chandrayaan-3: చంద్రయాన్-3 విజయం వెనుక ఉన్న హీరోలు వీళ్లే.. నిజంగా గ్రేట్ భయ్యా!
చంద్రయాన్-3 ల్యాండర్ జాబిల్లిపై కాలు మోపడం వెనుక ఉన్న రియల్ హీరోలపై సోషల్మీడియాలో చర్చ జరుగుతోంది. చంద్రయాన్-3 ప్రయోగాన్ని ముందుండి నడిపిన వారిలో ఇస్రో చైర్మన్ సోమనాథ్, చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్, U R రావు శాటిలైట్ సెంటర్ డైరెక్టర్ శంకరన్, VSSC డైరెక్టర్ ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్, మిషన్ డైరెక్టర్ మోహన్న కుమార్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చీఫ్ రాజరాజన్ ఉన్నారు.

Translate this News:











