Union Minister Rajnath Singh Telangana: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఖరారైంది. హుజురాబాద్ లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు హాజరుకానున్నారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. సోమవారం(అక్టోబర్ 16) మధ్యాహ్నం 12:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు హుజురాబాద్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జమ్మికుంటకు చేరుకుని మధ్యాహ్నం 1 గంటల నుంచి 2గంటల వరకు అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ సభ అనంతరం హెలికాప్టర్లో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు మహేశ్వరం మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగసభలో రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారు. సభ ముగిశాక 7:35 గంటలకు తిరిగి ఢిల్లీకి పయనం అవుతారు రాజ్నాథ్ సింగ్.
పూర్తిగా చదవండి..Telangana BJP: జమ్మికుంటకు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్.. షెడ్యూల్ వివరాలివే..
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ షెడ్యూల్ ఖరారైంది. హుజురాబాద్ లోని జమ్మికుంటతో పాటు మహేశ్వరంలో నిర్వహించే రెండు బహిరంగ సభలకు హాజరుకానున్నారు కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్. సోమవారం(అక్టోబర్ 16) మధ్యాహ్నం 12:10 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వస్తారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12:40 గంటలకు హుజురాబాద్ కు చేరుకుంటారు.

Translate this News:











