UIDAI Recruitment 2023: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా విభాగాల్లోని ఖాళీల వివరాలు, అర్హతలు, దరఖాస్తు తేదీ వంటి వివరాలను ప్రచురించింది. డైరెక్టర్ ( టెక్నాలజీ ) పోస్ట్ కోసం ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల కోసం UIDAI నోటిఫికేషన్ జారీ చేసింది. UIDAI రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. టెక్నికల్ డైరెక్టర్ 1 స్థానం ఖాళీగా ఉండగా.. ఆపోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు లెవెల్ 13 మేరకు నెలవారీ పే స్కేల్ పొందుతారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు ప్రభుత్వ సంస్థలచే గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో 04 సంవత్సరాల డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్లో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం/ రాష్ట్ర ప్రభుత్వం/ PSU/ అటానమస్ బాడీలలో ICT/ E-గవర్నెన్స్ ప్రాజెక్ట్‌లను హ్యాండిల్ చేయడం, IT/ టెలికాం/ నెట్వర్కింగ్/ డేటా సెంటర్ కార్యకలాపాలకు సంబంధించిన పనులను నిర్వహించడం, IT కొనుగోళ్లను నిర్వహించడం/ IT ఇన్వెంటరీ నిర్వహణ సంబంధిత పనులు మొదలైన వాటిలో అనుభవం కలిగి ఉండాలి.
పూర్తిగా చదవండి..UIDAI Recruitment 2023: UIDAIలో ఉద్యోగ అవకాశం.. మంచి శాలరీ, హోదా.. పోస్టుల వివరాలివే..
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా విభాగాల్లోని ఖాళీల వివరాలు, అర్హతలు, దరఖాస్తు తేదీ వంటి వివరాలను ప్రచురించింది. డైరెక్టర్ ( టెక్నాలజీ ) పోస్ట్ కోసం ఆసక్తి, అర్హత గల అభ్యర్థుల కోసం UIDAI నోటిఫికేషన్ జారీ చేసింది.

Translate this News:











