సనాతన ధర్మం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయినిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు. ‘‘సనాతన ధర్మం కారణంగా ఇబ్బందులు పాలైన బడుగు, అణగారిన వర్గాల తరుపునే నేను మాట్లాడా. పేరియార్, అంబేద్కర్ వంటి మహోన్నత వ్యక్తులు ఈ అంశంపై లోతైన పరిశోధనలతో పలు రచనలు చేశారు. సమాజంపై సనాతన ధర్మం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించిందో చెప్పారు. అవన్నీ తెలిపిందేకు నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రసంగంలోకి కీలక భాగాన్ని ఇక్కడ మరోసారి ప్రస్తావిస్తున్నా. దోమల కారణంగా కరోనా, డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో అదే విధంగా సనాతన ధర్మం సామాజిక రుగ్మతలకు దారి తీసింది. న్యాయస్థానంలోనైనా.. ప్రజాకోర్టులో అయినా సరే.. ఎలాంటి సవాల్కైనా సరే సిద్ధంగా ఉన్నా. తప్పుడు వార్తల వ్యాప్తిని మానుకోండి’’ అంటూ ట్వీట్ చేశారు.
పూర్తిగా చదవండి..UdhaynidhiStalin: సనాతన ధర్మం వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేదేలేదు
సనాతన ధర్మం గురించి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయినిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విమర్శలపై తాజాగా ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని మరోసారి స్పష్టంచేశారు.

Translate this News:











