Hyderabad: చోరీ అయిన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నేరానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేశారు. డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చాంద్రాయణగుట్టలోని 95వ సీఆర్పీఎఫ్ బెటాలియాన్లో సిద్దార్థ్ సింగ్ కానిస్టేబుల్. ఈనెల 24న సిద్దార్థ్ సికింద్రాబాద్(Secunderabad) రైల్వే స్టేషన్‌కు వచ్చాడు.10వ ప్లాట్ ఫాం పై ఉండగా అతని నుంచి ఇన్సాస్ గన్‌కు సంబంధించిన 60 బుల్లెట్లు పౌచ్‌తో సహా బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు దొంగలు. వెంటనే సిద్దార్థ్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన వెంటనే రైల్వేస్ అదనపు డీజీ శివధర్ రెడ్డి, ఎస్పీ షేక్ సలీమా జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బందితో ఎనిమిది బృందాలను రంగంలోకి దింపారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించిన ప్రత్యేక బృందాలు శ్రీకాకుళం జిల్లాకు చెందిన నక్కెని ఆనంద మూర్తి బుల్లెట్లు తస్కరించినట్టు కనుగొన్నారు.
పూర్తిగా చదవండి..Telangana: డబ్బులు అనుకుని బుల్లెట్లు ఎత్తుకెళ్లాడు.. కట్ చేస్తే డబుల్ ట్విస్ట్..
రైల్వే స్టేషన్ లో చోరీకి గురైన ఇన్సాస్ గన్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ బుల్లెట్లను ఎత్తుకెళ్లిన ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో కానిస్టేబుల్ వద్దనున్న బ్యాగ్ చూసి డబ్బుల ఉన్నాయని అనుకుని చోరీకి పాల్పడ్డాడట దొంగ. ఓపెన్ చేయగా బుల్లెట్లు ఉండటంతో.. అక్కడే వదిలేశాడు. మరో వ్యక్తి ఆ బుల్లెట్లను తీసుకెళ్లి ఇంట్లో దాచిపెట్టాడు.

Translate this News:











