Vijayashanti to join Congress?: సినీ నటి, బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanti) మళ్లీ కాంగ్రెస్(Congress) గూటికి చేరే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia gandhi)ని ప్రశంసిస్తూ ఆమె చేసిన ట్వీట్ వెనుక ఆంతర్యం అదేనని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. అందుకు చాలా బలమైన వాదనను వినిపిస్తున్నారు విశ్లేషకులు. ఇటివలి కాలంలో బీజేపీలో ఉన్నామా లేమా అన్న రీతిలో విజయశాంతి తీరు సాగుతోంది. బీజేపీలో అసంతృప్తిగా ఉన్నారు ఈ లేడి అమితాబ్. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందుతున్నారని ఇంటర్నెల్ టాక్. అటు బీజేపీ కూడా కీలక సమావేశాలకు విజయశాంతిని పిలవడంలేదు. దీనిపై కూడా ఆమె అసంతృప్తిగా ఉన్నారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పూర్తిగా చదవండి..Vijayashanti: కాంగ్రెస్‌లోకి రాములమ్మ..? లేడి అమితాబ్ ట్వీట్ వెనుక ఆంతర్యం అదేనా?
బీజేపీ, తల్లి తెలంగాణ, బీఆర్ఎస్, కాంగ్రెస్.. మళ్లీ బీజేపీ.. ఇలా అనేక పార్టీల్లో కీలక నేతగా వ్యవహరించిన లేడీ అమితాబ్ సినీ నటీ, మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ మహిళ నేత విజయశాంతి మరోసారి పార్టీ మారుతారాన్న ప్రచారం జరుగుతోంది. సోనియాగాంధీని ప్రశంసిస్తూ తాజాగా రాములమ్మ చేసిన ట్వీట్‌తో పాటు బండి సంజయ్, మణిపూర్ అంశాల్లో బహిరంగంగా బీజేపీని వ్యతిరేకించిన విజయశాంతి కొంతకాలంగా కమలం పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు..

Translate this News:











