కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలోని తన నివాసానికి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చేరుకున్నారు. తుమ్మల నివాసానికి భారీ సంఖ్యలో అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు తరలివస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆశావాహులు తుమ్మలను స్వయంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆయన ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. అయితే వచ్చేఎన్నికల్లో తన అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మలకు పాలేరు అభ్యర్థిత్వం ఇవ్వకపోవటంతో… ఆ పార్టీకి రాజీనామా చేశారు తుమ్మల. తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే సమక్షంలో తుమ్మల హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Telangana Politics: ఖమ్మానికి చేరిన తుమ్మల.. షాక్ ఇచ్చిన రేణుక.. కారణమిదేనా?
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. 40 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన తుమ్మల.. ఇకపై కాంగ్రెస్ నేతగా తన ప్రయాణం సాగించనున్నారు.

Translate this News:











