రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఖమ్మం జిల్లాలోని నాయకన్ గూడెంలో అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేశానని, ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశానన్నారు. మరోవైపు గత 40 ఏళ్లుగా జిల్లా ప్రజలకు సేవ చేస్తున్నానన్న ఆయన.. ఎన్నడూ అధికారం కోసం ఆరాటపడలేదని, ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకుంటూనే తాను ముందుకు వెళ్లాలని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Tummala Nageswara Rao: పోటీకి సై.. క్లారిటీ ఇచ్చిన తుమ్మల
రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు.

Translate this News:











