రజాకార్ల నీచ నీకృష్ట పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందని.. ఎందరో మంది బిడ్డలు, బలిదానాలకు గురైయ్యారని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామా భూపాల్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు సామా భూపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు రజాకార్లు మత పిచ్చితో బానిసత్వంలో ఉన్న వారిపై పైశాచిక ఆనందం పొందుతూ పాలన చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎందరో తెలంగాణ మహాను భావులను పొట్టన పెట్టుకున్న మూర్ఖుడు ఖాసిం రజ్వీ అన్నారు.
సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందని గుర్తు చేశారు సామా భూపాల్ రెడ్డి. ‘వ్యవసాయం చేసే అక్కలు కొడవల్లు పట్టిరు. దుక్కి దున్నే నాగళ్లతో పొలం పనులు చేసే రైతన్నలు చేతుల్లో తుపాకులు పట్టిర్రు, భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శగా తీసుకొని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజలు తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేశారు’ అని అన్నారు.
Razakars: నేడు రజాకార్ల రాజ్యం నడుస్తోంది.. టీడీపీ ఫైర్!
నేడు తెలుగు రాష్ట్రాల్లో నిరంకుశ పాలన చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, గాంధీ మార్గాన్ని అనుసరించి గ్రామ స్వరాజ స్థాపనకు శ్రీకారం చుట్టారని నాటి సీఎం ఎన్టీఆర్‌ని తెలంగాణ టీడీపీ నేతలు సెప్టెంబర్ 17 సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందని సామా భూపాల్ రెడ్డి చెప్పారు.

Translate this News:











