కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల అడవీ ప్రాంతంలో చిరుతల కలకలం రేగుతోంది. ఇటీవల అలిపిరి నడక మార్గంలో ఉన్న నరసింహా స్వామి ఆలయం వద్ద చిరుత చిన్నారిపై దాడి చేసి చంపింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు చిరుతను బంధించేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు అమర్చడంతో ఒక్కటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో చిరుతలు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆపరేషన్ చిరుతను ప్రారంభించారు. ఇప్పటి వరకు 5 చిరుతలను బంధించినట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఇక భక్తులకు భయం లేదు
టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో వచ్చే భక్తుల రక్షణను దృష్టిలో ఉంచుకొని కంచెను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. కానీ ఈ కంచేను ఎంత దూరం ఏర్పాటు చేస్తారనేది సందిగ్ధంగా మారింది.

Translate this News:











