TSRTC Special Buses for Dasara: దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 13వ తేదీ నుంచి 25వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఈ బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24 దసరా నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్నీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్లాన్స్ వేస్తోంది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రధాన బస్టాండ్స్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్ బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్ – ఉప్పల్, ఎంజీబీఎస్ – జేబీఎస్, ఎంజీబీఎస్ – ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనున్నారు.
పూర్తిగా చదవండి..TSRTC: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రజలకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన టీఎస్ఆర్టీసీ..
దసరా పండుగకు ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)(TSRTC) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారి సౌకర్యార్థం 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.

Translate this News:











