ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే విజయవాడ మార్గంలో 10 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడుపుతున్న ఆర్టీసీ తాజాగా మిగతా రూట్లలోనూ ఈ బస్సులను నడపనున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా జిల్లాల కేంద్రాలకు ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఇప్పటికే 1860 ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ ఆర్డర్ ఇచ్చింది. ఇందులో కొన్నింటిని డిసెంబర్ లో వాడకంలోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది సంస్థ. ఈ నేపథ్యంలో హరియాణా రాష్ట్రం పల్వాల్ లో జేబీఎం గ్రూప్ సంస్థలో తయారవుతున్న కొత్త ఎలక్ట్రిక్ బస్సుల నిర్మాణాన్ని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్, ఐపీఎస్ బుధవారం స్వయంగా పరిశీలించారు. వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సులను ఆయన తనిఖీ చేశారు. తయారీదారులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన ఈ బస్సుల నిర్మాణాన్ని పూర్తిచేసి టీఎస్ఆర్టీసీకి అందించాలని సజ్జనర్ కోరారు.
పూర్తిగా చదవండి..TSRTC: హైదరాబాద్ నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తో పాటు.. ఆ ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్

Translate this News:











