తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగల్లో దసరా (Dasara 2023) ఒకటి. ఈ పండుగ వచ్చిందంటే చాలు.. అందరూ సొంతూళ్లకు వెళ్లడంతో పట్టణాలు, నగరాలన్నీ ఖాళీ అవుతాయి. పండుగకు పది రోజుల ముందు నుంచే బస్సులు, రైళ్లన్నీ కిక్కిరిసిపోయి కనిపిస్తుంటాయి. టోల్ గేట్ల వద్ద కూడా వాహనాలు బారులుదీరుతుంటాయి. ఇదే అదనుగా ప్రైవేట్ వాహనాల వారు టికెట్ ధరలను కూడా రెట్టింపు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ముందస్తు గా టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్టర్ (ఎక్స్) ద్వారా ప్రకటన చేశారు. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..TSRTC Dasara Offer: దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. 10 శాతం డిస్కౌంట్.. ఇలా బుక్ చేసుకోండి!

Translate this News:











