ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాలకు చెందిన అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాల్లో నివసిస్తుంటారు. గల్ఫ్ వెళ్లే వారు బస్సుల ద్వారా శంషాబాద్ చేరుకుని అక్కడి నుంచి ఫ్లైట్ లో వెళ్తుంటారు. అయితే.. శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు నేరుగా బస్సు సర్వీసులు (TSRTC New Bus Service) లేకపోవడంతో హైదరాబాద్ కు వచ్చి మళ్లీ అక్కడి నుంచి శంషాబాద్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో టైం వేస్ట్ కావడంతో పాటు.. డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. ఇలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ (TSRTC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును ప్రవేశపెట్టినట్లు ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పూర్తిగా చదవండి..TSRTC: ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త.. ఆ జిల్లాల నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు డీలక్స్ బస్సు.. వివరాలివే!
వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్దిపేట మీదుగా శంషాబాద్ కు స్పెషల్ బస్ సర్వీసును ప్రవేశపెట్టింది తెలంగాణ ఆర్టీసీ. ప్రతీ రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరి సాయంత్రం 9 గంటలకు శంషాబాద్ కు చేరుకుంటుంది.

Translate this News:











