దసరా (Dussehra 2023) పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ (TSRTC). ఈ పండుగ సీజన్లో ప్రయాణించిన వారికి భారీగా బహుమతులు అందించనున్నట్లు ప్రకటించింది. బహుమతులు గెలుచుకోవడానికి ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనుకాల ప్రయాణికులు తమ పూర్తి పేరు, ఫోన్ నంబర్ ను రాసి ఆయా బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ ల్లో వేయాలని సూచించింది ఆర్టీసీ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులు అందించనున్నట్లు ప్రకటించింది. ప్రతీ రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొక్కరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనున్నట్లు వివరించింది ఆర్టీసీ. ఈ నెల 21 నుంచి 23 తేదీ వరకు, మళ్లీ 28 నుంచి 30 తేదీల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు.
పూర్తిగా చదవండి..TSRTC Dussehra Offer: దసరాకు ఆర్టీసీ బస్సులో ఊరెళ్లండి.. రూ.9900 గెలుచుకోండి.. బంపరాఫర్!

Translate this News:











