తెలంగాణలో రెండోసారి గ్రూప్-1 పరీక్ష (TSPSC Group-1 Exam) రద్దు కావడంతో అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ లో తప్పనిసరిగా ఊరట లభిస్తుందని టీఎస్పీఎస్సీ భావించింది. కానీ.. డివిజన్ బెంచ్ సైతం పేపర్ రద్దును సమర్థిస్తూ తీర్పు రావడంతో కమిషన్ సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. డివిజన్ బెంచ్ తీర్పు వచ్చిన రోజు కమిషన్ పాలకవర్గం భేటీ జరిగింది. హైకోర్టు (Telangana High Court) తీర్పుతో ఇప్పుడు ఏం చేయాలన్న అంశంపై సుధీర్ఘంగా చర్చించింది పాలకవర్గం. కానీ ఆ సమావేశంలో కమిషన్ ఎలాంటి నిర్ణయానికి రాలేకపోయింది. అయితే.. పేపర్ రద్దు విషయంలో టీఎస్పీఎస్సీ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి. మొదటిది.. హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించడం. రెండవది.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు (Supreme Court) అప్పీలుకు వెళ్లడం. అయితే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో సారి పరీక్ష అంటే అభ్యర్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతారని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. అయితే.. హైకోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తర్వాత సుప్రీం కోర్ట్ లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Ts govt jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్న్యూస్…ఈ శాఖలో 8 వేల పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్..!!
TSPSC Group-1 Updates: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీ ముందున్న రెండు ఆప్షన్లు ఇవే.. నోటిఫికేషన్ నుంచి నేటి వరకు అసలేం జరిగిందంటే?
తెలంగాణలో రెండో సారి గ్రూప్-1 పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఏం చేయానల్న అంశంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణలతో చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి టీఎస్పీఎస్సీ వచ్చినట్లు తెలుస్తోంది.

Translate this News:











