తెలంగాణలో దాదాపు 7 లక్షలకు పైగా అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న గ్రూప్-4 ఫలితాలపై (tspsc group-4) అప్టేట్ వచ్చేసింది. ఈ రిజల్ట్స్ ను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ (tspsc) ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఫైనల్ కీని మరో పది రోజుల్లో విడుదల చేయాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణలో మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు మొత్తం 9.51 లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. జులై 1వ తేదీన ఇందుకు సంబంధించిన పరీక్షను నిర్వహించగా మొత్తం 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..TSPSC Group-4 Results: తెలంగాణ గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫైనల్ కీ, రిజల్ట్స్ పై కీలక అప్టేట్.. విడుదల ఎప్పుడంటే?
తెలంగాణలో గ్రూప్-4 ఫైనల్ కీని మరో 10 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అనంతరం ఫలితాలను అక్టోబర్ లో విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.

Translate this News:











