తెలంగాణలో ఈ ఏడాది జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను (TSPSC Group-1 Exam) హైకోర్టు నిన్న రద్దు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ పేపర్ లీకేజీ కారణంగా ఓసారి పరీక్ష రద్దు అయ్యింది. రెండు సార్లు పరీక్ష రద్దు కావడంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. అనేక వ్యయప్రయాసలకు ఓర్చుకుని.. కుటుంబాన్ని వదులుకుని ఏళ్లుగా గ్రూప్-1 ఉద్యోగ సాధనే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వారి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇప్పటికే తాము చేస్తున్న ఉద్యోగాలకు ఏళ్లుగా సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్నామని.. మళ్లీ నెలల పాటు సెలవులు ఎలా పెట్టాలని వారు ఆదేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై టీఎస్పీఎస్సీ (TSPSC) సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు కమిషన్ న్యాయనిపుణలతో చర్చలు ప్రారంభించింది. ఆలస్యం చేయకుండా సోమవారమే టీఎస్పీఎస్సీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేయనున్నట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..TSPSC Group-1 Exam: గ్రూప్-1 పరీక్ష రద్దుతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన.. టీఎస్పీఎస్సీ నెక్ట్స్ స్టెప్ ఇదే?
తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేయాలని కమిషన్ భావిస్తోంది.

Translate this News:











