తెలంగాణలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET-2023)ను ఈ నెల 15న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని తాజాగా విడుదల చేశారు అధికారులు. అభ్యర్థులు ప్రైమరీ కీపై అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం కల్పించారు అధికారులు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ అభ్యంతరాలను అభ్యర్థులు తెలియజేయాలని టెట్ కన్వీనర్ రాధారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో https://tstet.cgg.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో తమ అభ్యంతరాలను తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీని విడుదల చేయనున్నారు. ఫలితాలను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 25 లేదా 26 తేదీల్లో ఫైనల్ కీ విడుదల చేసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..TS TET-2023: తెలంగాణ టెట్ పరీక్షకు హాజరైన వారికి బిగ్ అలర్ట్.. కీలక ప్రకటన.. వివరాలివే!
తెలంగాణ టెట్ పరీక్షకు సంబంధించిన ప్రైమరీ కీని అధికారులు తాజాగా విడుదల చేశారు. కీపై అభ్యంతరాలను ఈ నెల 23లోగా సమర్పించాలని సూచించారు.

Translate this News:











