BRS Manifesto: అక్టోబర్ 16న వరంగల్ లో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ (BRS Meeting) ఉంటుందని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఆ సభలోనే సీఎం కేసీఆర్ (CM KCR) మేనిఫెస్టో ప్రకటిస్తారన్నారు. తమ మేనిఫెస్టో ప్రత్తిపక్షాల మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందన్నారు. ప్రజలంతా శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో (BRS Manifesto) మహిళలకు శుభవార్త ఉంటుందన్నారు హరీశ్ రావు (Minister Harish Rao). మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు ఆయన. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తన ప్రధానమైన హామీలను ప్రకటించిన నేపథ్యంలో కేసీఆర్ (CM KCR) ప్రకటించే మేనిఫెస్టోపై ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పింఛన్ల పెంపుపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. ఇంకా.. రైతు బంధు (Rythu Bandhu) సాయం పెంపుపై కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: ఎన్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!!
పూర్తిగా చదవండి..











