Revanth Reddy: మీరు అనుభవిస్తున్న పదవులు, హోదా కాంగ్రెస్ పెట్టిన బిక్ష అంటూ బీఆర్ఎస్(BRS) పెద్దల టార్గెట్గా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (TPCC Chief Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఎక్కడా లేని విధంగా ఆరోగ్య శ్రీ (Arogyasri), రైతు రుణమాఫీ, ఫీజ్ రీయింబర్స్మెంట్ లాంటి పథకాలు అమలు చేసింది కాంగ్రెసేనన్నారు రేవంత్రెడ్డి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్లో చేస్తున్న అభివృద్ధి మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్రెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్లో (Congress) చేరారని.. తాను పోటీ చేసే స్థానాన్ని వంశీ చంద్ రెడ్డి, నారాయణ రెడ్డికి ఇచ్చి ఆహ్వానించారన్నారు రేవంత్రెడ్డి. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నానని.. తెలంగాణ మిగతా నాయకులు వంశీచంద్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ముందుకు రావాలన్నారు రేవంత్రెడ్డి.
పూర్తిగా చదవండి..Revanth Reddy :తెలంగాణలో బిల్లా రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారు.. రేవంత్రెడ్డి హాట్ కామెంట్స్!
తెలంగాణలో బిల్లా, రంగాలు ఇద్దరు జనం మీద పడ్డారన్నారు రేవంత్రెడ్డి. కేసీఆర్కు ముఖం చెల్లక బిల్లా రంగాలు తిరుగుతున్నారని.. కాంగ్రెస్ ఏం చేసిందో బిల్లా రంగాలు కేసీఆర్ను అడిగితే చెబుతారన్నారు. మరుగుజ్జులు ఎవరో... ప్రజల మనుషులు ఎవరో 45 రోజుల్లో తేలుతుందన్నారు రేవంత్రెడ్డి.

Translate this News:











