ఈ నెల 10న హోమ్ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఒకె రోజు రెండు బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఉదయం అదిలాబాద్ జిల్లాలో అమిత్ షా సభ ఉండగా.. సాయంత్రం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. బండ్లగుడా జాగీర్ మున్సిపల్ పరిధిలో బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ సభలతో జోష్ లో ఉన్న కాషాయ పార్టీ నేతలు… భవిష్యత్ కార్యాచరణను సిద్దం చేసుకుంటున్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఏడు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అధికారమే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా(JP Nadda) పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..BJP: తెలంగాణలో కమలం దూకుడు.. ఒకే రోజు అమిత్‌షా రెండు బహిరంగ సభలు!
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. కేంద్ర పెద్దలు నేరుగా రంగంలోకి దూకుతున్నారు. మోదీ, నడ్డా ఇప్పటికే కమలం కార్యకర్తల్లో జోష్ నింపగా.. అమిత్‌షా మరోసారి తెలంగాణ రానున్నారు. ఈ నెల 10న అమిత్‌షాతో ఏకంగా రెండు బహిరంగ సభలు ప్లాన్ చేసింది బీజేపీ.

Translate this News:











