ఇంకా కులం పేరు చెప్పడానికే సిగ్గుపడే కులాలు ఎన్నో ఉన్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajendar). అసలే గుర్తింపు లేని కులాలు కూడా ఉన్నాయని… అందుకే తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 40 రోజుల పాటు అసెంబ్లీలో కులాల వారీగా కూర్చోబెట్టి వారి సమస్యలు రాసుకున్నానని చెప్పారు ఈటల. ఇందిరాపార్క్ వద్ద పూసల సంఘం ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఎంబీసిలో, DNTలలో చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ చేస్తున్న నిరాహారదీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఈటల రాజేందర్.
పూర్తిగా చదవండి..Etela Rajender: ఈటల రాజేందర్ సంచలన హామి.. వారిలో ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు!
పూసల వాళ్ళ వృత్తి ఒకప్పుడు గొప్పగా ఉండేదని.. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. గతి లేక ఈ పని చేస్తున్నారన్నారు. భీమా కింద రైతుకు, కల్లు గీత కార్మికులకు, మత్యకారులకు, గొర్ల కాపరులకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నారని.. కానీ రైతుకూలీలకు మిగిలిన పేదవారికి ఇవ్వడంలేదన్నారు ఈటల. మేము అధికారంలోకి వస్తే తెల్లరేషన్ కార్డు ఉన్న 59 సంవత్సరాల లోపు ఎవరు చనిపోయిన ప్రతి ఒక్కరికీ 5 లక్షల రూపాయలు స్కీమ్ మ్యానిఫెస్టోలో పెడతామన్నారు ఈటల.

Translate this News:











