Hyderabad Metro Rail: ప్రయాణికుడికి ఇబ్బంది కలిగించినందుకు గాను హైదరాబాద్ మోట్రో రైల్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ జరిమానా విధించింది. తప్పుడు సైన్ బోర్డులతో ప్రయాణికుడి సమయాన్ని వృథా చేసినందుకు రూ. 5 వేల ఫైన్, కేసు ఖర్చుల కోసం అదనంగా రూ. వెయ్యి చెల్లించాలని ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే.. సైదాబాద్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన 2022 డిసెంబర్ 16న హఫీజ్‌పేట్ వెళ్లేందుకు.. దిల్సుఖ్నగర్ నుంచి మలక్‌పేట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్ర స్టేషన్లో 9.45 గంటలకు ట్రైన్ దిగారు. మలక్‌పేట్ రైల్వే స్టేషన్‌కు త్వరగా చేరుకోవాలని అక్కడ సైన్ బోర్డులను ( దిక్కుల సూచిక బోర్డు) అనుసరిస్తూ కౌంటర్ వద్ద మెట్రో కార్డును ట్యాప్ చేశారు.
పూర్తిగా చదవండి..మెట్రో సంస్థకు మొట్టికాయలు..రూ. 6 వేలు జరిమానా..!!
హైదరాబాద్ మెట్రో సంస్థకు వినియోగదారుల కమిషన్ రూ.6 వేల ఫైన్ విధించింది. మెట్రో స్టేషన్లో తప్పుడు సైన్ బోర్డులు ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగింది. అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ప్రయాణకుడికి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.

Translate this News:











