విజయనగరం రైలు ప్రమాదం చాలా ట్రైన్స్ రాకపోకలను అడ్డుకుంది. ఈ దారిలో వెళ్ళే రైళ్ళను కొన్నింటిని పైర్తిగా రద్దు చేయాల్సి వచ్చింది. మరి కొన్నింటిని దారి మళ్ళించారు. సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ ( 17016)ను సత్తెనపల్లిలో నిలిపేశారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (12704)ను నల్లపాడు రైల్వేస్టేషన్లో ఆగిపోయింది. రూట్ ఎప్పటికి క్లియర్ అవుతుందో స్పష్టమైన సమాచారం తెలియకపోవడంతో నల్లపాడు, సత్తెనపల్లి స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడ అధికారులు సిబ్బందిని ఏర్పాటు చేవారు. ప్రయాణికులకు ఇబ్బంది కాకుండా ఆహారం, నీరు సదుపాయాలను కల్పిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Trains:ప్రమాదం కారణంగా రద్దయిన ట్రైన్స్ వివరాలు ఇవే…
విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. దీనిలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 14 మంది చనిపోగా 100 మంది దాకా గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. రైళ్ళ భోగీలు నుజ్జునుజ్జు అయిపోయాయి. ఈ ప్రమాదం వలన పలు రైళ్ళ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భువనేశ్వర్, విశాఖ వైపు వెళ్ళే రైళ్ళను కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్ళించారు.

Translate this News:











