రైలు ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా, గాయపడినా ఇచ్చే పరిహారాన్ని పదింతలు పెంచుతూ రైల్వేబోర్డు(IRCTC) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెప్టెంబర్ 18న ఉత్తర్వులు జారీ చేయగా.. అదే రోజు నుంచే పరిహారం పెంపు అమల్లోకి వచ్చింది. 2013లో చివరిసారిగా ఈ మొత్తాలు పెంచారు. కొత్త నిర్ణయం ప్రకారం రైలు ప్రమాదాల్లో మరణించిన వ్యక్తి కుటుంబానికి 5లక్షల పరిహారం ఇస్తారు. రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.25,000 బదులు రూ.2.5 లక్షలు; స్వల్పగాయాలైనవారికి రూ.5,000 బదులు రూ.50,000 ఇస్తారు. ఉగ్రదాడులు, హింసాత్మక ఘటనలు, రైళ్లలో దోపిడీలు వంటి అవాంఛిత ఘటనల సమయంలో ఈ పరిహారాలు వరుసగా రూ.1.50 లక్షలు, రూ.50 వేలు, రూ. 5 వేలుగా నిర్ణయించారు.
పూర్తిగా చదవండి..ట్రైన్ యాక్సిడెంట్ బాధితుల ఎక్స్ గ్రేషియా పది శాతం పెంపు
భారతీయ రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పది రెట్లు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రైళ్లలో, కాపలాదారులున్న లెవెల్ క్రాసింగ్ గేట్ల వద్ద జరిగే ప్రమాదాల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు ప్రస్తుతం రూ.50,000 చెల్లిస్తుండగా ఇప్పుడు రూ.5 లక్షలు ఇస్తారు.

Translate this News:













