కూలీలపై పిడుగు పడ్డ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటు చేసుకుంది. కూలీలు పొలం వద్ద పనులు చేస్తున్న సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో ముగ్గురు కూలీలు పక్కనే ఉన్న చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చెట్టుపై పిగుడు పడటాన్నిగమనించిన ఇతర కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్ధలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం.. పిడుగు పడి మహిళ మృతి
జోగులాంబ గద్వాల జిల్లా అమరవాయి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. కూలీ పని కోసం వెళ్లిన మహిళపై పిడుగు పడటం ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

Translate this News:











