ఎన్నికల యుద్ధంలోకి తెలంగాణ కాంగ్రెస్ కాలు దువ్వింది. ఎలక్షన్ ప్రక్రియను అధికారికంగా షురూ చేసింది. ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. సీఏల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, అంజన్ కుమార్ యాదవ్, ఇతర నేతలతో కలిసి దరఖాస్తు నమూనాను విడుదల చేశారు. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు తీసుకోనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..టీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలంటే ఇలా చేయాల్సిందే? 25 వరకూ గడువు
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. నేటి నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఏల్పీ నేత భట్టి విక్రమార్క దరఖాస్తు నమూనాను విడుదల చేశారు.

Translate this News:












