ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్ ను గెలిపించేందుకే మోదీ పర్యటనలు అంటూ ఆరోపించారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. బీఆరెస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారని అన్నారు. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటకు కనిపించేది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే..తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ రేవంత్ రెడ్డి హితబోధ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తో బీఆరెస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆరెస్, 7 బీజేపీ కి, 1 ఎంఐఎం కు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్ మీద బీజేపీ, బీఆరెస్ ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాళ్లిద్దరూ కాంగ్రెస్ ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు.మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా అన్నారు రేవంత్.
పూర్తిగా చదవండి..revanth reddy:మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం- రేవంత్ రెడ్డి
మోదీ, కేసీఆర్ ది ఫెవికాల్ బంధం అని ఆరోపించారు టీ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆరెస్ ఒక్కటే... అవిభక్త కవలలన్నారు. బీఆరెస్, బీజేపీ బంధాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ బయటపెట్టారని చెప్పారు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో రెండు పార్టీలను దుయ్యబట్టారు.

Translate this News:











