Actor Navdeep in Madhapur Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్(Navdeep) హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ పేరు ప్రధానంగా వినిపించింది. దాంతో అతను పరారీలో ఉన్నారంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే సీపీ ప్రకటించిన నవదీప్ తాను కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు హీరో నవదీప్. తానెక్కడికీ పారిపోలేదని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఈ డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే, నవదీప్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Madhapur Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం..
డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే, నవదీప్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది.

Translate this News:











