World Polio Day 2023: నేడు,అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి గుర్తించిన ప్రపంచ పోలియో దినోత్సవం. పోలియో అనే పదం పోలియోమైలిటిస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. పోలియో అంటే బూడిద.’మైలోన్’ అంటే మజ్జ. ఎముక మజ్జలో ఈ వ్యాధి మొదలవుతుంది కాబట్టి దీనిని పోలియోవైరస్ లేదా పోలియోమైలిటిస్. వెన్నెముక్క, మెదడు కాండంలోని నరాలపై దీని ప్రభావం ఉంటుంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి అవయవాలను కదపలేక పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం,కొన్నిసార్లు ఇది తీవ్ర స్థాయికి చేరి మరణానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. పోలియోమైలిటిస్ ముదిరితే పక్షవాతం అవుతుంది.
పూర్తిగా చదవండి..World Polio Day 2023:నేడు ప్రపంచ పోలియో దినోత్సవం
పోలియో ఒకప్పుడు ఇదో పెద్ద మహమ్మారి. దీని బారిన పడి చాలా మంది పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయి. గర్భధారణ సమయంలో లేదా పిల్లలకు ఈ వ్యాధి సోకుతుంది.పోలియో పోలియోమైలిటిస్ లేదా పోలియో వైరస్ వల్ల కలిగే వ్యాధి. దీనినే శిశువు పక్షవాతం అని కూడా అంటారు.ప్రమాదకరమైన అంటువ్యాధిగా పరిగణించే పోలియో నేరుగా నాడీ మండలంపైనే దాడి చేస్తుంది. దీన్ని అరికట్టడానికి..పోలియో టీకాల మీద అవగాహన పెంచడానికి అక్టోబర్ 24న ప్రపంచ పోలియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

Translate this News:











