Stock Markets Today: నిన్నటి లాభాలు నేడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. స్వల్ప లాభాలతో నిన్న ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా ఉదయం కూడా అదే ఊపును కొనసాగించాయి. దానికి తోడు ఈరోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అమెరికా మార్కెట్లు, ఐరోపా మార్కెట్లు కూడా ఇదే బాటలో ఉన్నాయి. ఉదయం దేశీయ మార్కెట్లు మొదలైన సమయానికి సెన్సెక్స్ (Sensex) 375 పాయింట్లు లాభంతో 66,454 దగ్గర, నిఫ్టీ (Nifty) 110 పాయింట్లు లాభపడి 19,800 దగ్గర ఉన్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ఉంది. సెన్సెక్స్ లో ఉండే 30 సూచీలు లాబాల్లోనే ఉన్నాయి. టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్టీ, విప్రో, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, ఏఎస్డబ్యల్యూ స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎన్టీపీసీ, హెచ్యూఎల్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఎక్కువగా లాభపడుతున్న షేర్లలో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Stock Markets Today:మంచిరోజు…లాభాల్లో స్టాక్ మార్కెట్
అంతర్జాతీయ మార్కెట్లోల సానుకూల సంకేతాలు ఉండటంతో ఈరోజు దేశీయ మార్కెట్లు లాబాల్లో నడుస్తున్నాయి. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 375 పాయింట్ల లాభంతో 66454 దగ్గర, నిఫ్టీ 97 పాయింట్లు లాభపడి 19,800 కొనసాగుతున్నాయి.

Translate this News:











