రెండు రోజుల నుంచీ స్టాక్ మార్కెట్లు డౌన్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. మూడో రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈరోజు ఉదయం నష్టాలతో మొదలైన దేశీయ మార్కెట్లు సాయంత్రం అయ్యేసరికి నష్టాలతోనే ముగిసాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల ప్రభావం ఈరోజు మార్కెట్ మీద బాగా చూపించింది. దానికి తోడు అందరూ ఊహించినట్టుగానే ఫైడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు యథాతథంగా ఉంచడం కూడా స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేశాయి. మరోవైపు కెనడా-భారత్ సంబంధాలు చెడిపోవడం కూడా మర్కెట్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. దీంతో నిఫ్టీ సూచి సెప్టెంబర్ 7నాటి కనిష్టానికి పడిపోయింది. దీంతో ఈరోజు ఉదయం ఆరంభం అవడమే నష్టాలతో ఆరంభం అయింది. ఉదయం 9.25 గంటలకు సెన్సెక్స్ 315 పాయింట్ల నష్టంతో 66, 484 ట్రేడ్ అయింది. నిఫ్టీ 90 పాయింట్లు నష్టపోయి 19, 810 దగ్గర కొనసాగింది.
పూర్తిగా చదవండి..నష్టాలతో మొదలయి..నష్టాలతోనే ముగిసింది
దేశీయ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాలతో ముగిసాయి. ఫెడ్ రేటు నిర్ణయం, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలతో మార్కెట్లు రోజంతా నష్టాలతోనే కొనసాగింది.

Translate this News:












