ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరి రోజుకు చేరుకున్నాయి. టీడీపీ నిరసనలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు, విజిల్స్, అరుపులు, కేకలతో.. రెండు రోజులు సమావేశాలు వాడివేడిగా సాగాయి, ఆ తర్వాత ప్రతిపక్షం లేని సమావేశాలు మరో రెండు రోజులు కొనసాగాయి. ఈ రోజు ఆఖరు రోజు. సభలో నేడు రెండు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది జగన్ ప్రభుత్వం. సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశముంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం అవుతుంది. తర్వాత మూడు అంశాలపై అసెంబ్లీలో స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ మార్పులో అక్రమాలపై అధికార పార్టీ సభ్యులు చర్చిస్తారు. ఆరోగ్య రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, దేవాలయాల అభివృద్ధి-ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కూడా స్వల్ప కాలిక చర్చ జరుగుతుంది.
పూర్తిగా చదవండి..AP assembly:ఏపీ అసెంబ్లీ సమావేశాలు చివరిరోజున కీలక బిల్లులు
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఐదు రోజులపాటూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. చివరి రోజు సభలో రెండు కీలక బిల్లులను వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Translate this News:











