Minister Roja sensational comments on pawan kalyan and chandrababu: నందమూరి ఫ్యామిలీ(Nandamoori) చేతిలోకి వెళ్లకుండా టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) పక్కా ప్లాన్ రచించారంటూ మంత్రి రోజా(Minister roja) సంచలన ఆరోపణలు చేశారు. బాలకృష్ణను సైడ్ చేసేందుకే జనసేన అధినేత పవన్‌ని తెరపైకి తీసుకొచ్చారన్నారు. చంద్రబాబునాయుడు, పవన్‌పై రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు(chandrababu) , పవన్(Pawan) ములాఖత్‌లో కుట్ర కోణం ఉందన్నారు రోజా. చంద్రబాబు, పవన్ ఒక్కటేనని.. ముందు నుంచి చెబుతున్నామన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే చంద్రబాబు దోచుకున్నారన్నారు. సీఎంకు తెలియకుండా నిర్ణయాలు జరుగుతాయా అని ప్రశ్నించారు. సీఐడీ దగ్గరకు వెళ్లి సంతకాలను బాబు చూసుకోవాలని.. లోకేశ్(lokesh) కూడా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు రోజా.
మంత్రి రోజా ఇంకేం అన్నారంటే?
Roja vs Pawan: బాలకృష్ణను పక్కన పెట్టేందుకే పవన్..? ఇది కుట్ర..! రోజా సంచలన వ్యాఖ్యలు
వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటి చేస్తామని తేల్చి చెప్పిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్‌గా వైసీపీ మంత్రి రోజా ఫైర్ అయ్యారు. బాలకృష్ణను పక్కన పెట్టడం కోసమే తెరపైకి పవన్‌ని తీసుకొచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. నందమూరి ఫ్యామిలీ చేతిలోకి పార్టీ పగ్గాలు వెళ్లకూడదన్నది చంద్రబాబు ప్లాన్ అని మండిపడ్డారు. ప్యాకేజ్ కోసమే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

Translate this News:











