టీటీడీ చెందిన ఓ ఎలక్ట్రిక్ బస్సుని చోరీ చేశారు. తిరుమలలోని టీటీడీ ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయం నుంచి ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి బస్సును చోరీరి గురైంది. తిరుమల నుంచి తిరుపతికి .. అక్కడి నుంచి నెల్లూరు వైపునకు బస్సును తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం గ్యారేజీలో బస్సు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే తిరుమల క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జీపీఎస్ సిస్టమ్ ద్వారా బస్సును.. నాయుడుపేట, గూడూరు మధ్యలో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Tirumala Srivari bus: తిరుమలలో రెచ్చిపోయిన దొంగలు..ఏకంగా శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లిన వైనం..!!
తిరుమలలో భక్తుల ఉచిత బస్సు చోరీకి గురికావడంతో కలకలం రేగింది. ఏదయినా వస్తువు పోతేనే పెద్ద హడావిడి జరుగుతుంది. అలాంటిది ఏకంగా బస్సు మాయం కావడంతో టీటీడీ అధికారులు కంగారు పడ్డారు. అధునాతన టెక్నాలజీ ఉన్న జీపీఎస్ బస్సు కావడంతో దాని లొకేషన్ కనిపెట్టారు. ఆ బస్సుని ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో చూద్దాం.

Translate this News:











