పిడుగు పాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని దామెరకుంట చెందిన గూడూరు రాజేశ్వర్రావు అనే రైతు తన పొలంలో కలుపు తీయడానికి వెళ్లాడు. అప్పటి వరకు ముసురుగా ఉన్న వాన ఒక్కసాగా భారీ వర్షం కురువడంతో రైతు చెట్టు కిందకు వెళ్ళాడు. భారీ వర్షానికి తలదాచుకుందామని చెట్టుకిందకు వెళ్లిన రైతుపై పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మరోవైపు చిట్యాల మండలం కైలాపూర్లో మిరప నారు నాటేందుకు వెళ్లిన ఇద్దరు కూలీలు మృతి చెందారు.
పూర్తిగా చదవండి..పిడుగుపాటుకు ముగ్గురు మృతి.. ఎక్కడంటే.!
పిడుగు పాటుకు ముగ్గురు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భారీ వర్షానికి కూలీలు చెట్ల కిందకు వెళ్లడంతో చెట్లపై పిడుగు పడింది. దీంతో కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.

Translate this News:











