India vs Bharat Row – Dilip Ghosh: ఇండియా పేరును భారత్ గా మార్చాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని మీద విపరీతంగా చర్చ జరుగుతోంది. పేరు కచ్చితంగా మారుతుందని అధికార పార్టీ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలను కూడా ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న జీ 20 సదస్సులో ప్రధాని మోదీ కూర్చునే చోట కూడా ఇండియాకు బదులు భారత్ అనే నేమ్ ప్లేట్ నే పెట్టారు. అలాగే సదస్సులో ఎక్కడా ఇండియా అనే పేరు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీలయినంత ప్రతీ చోటా భారత్ పేరునే ప్రమోట్ చేసింది కూడా. కానీ అధికార పార్టీ తీసుకున్న ఈ నిర్ణయానికి చాలా వ్యతిరేకత ఎదురవుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డైవర్షన్ పాలిటిక్స్ అంటూ విమర్శలు చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..India vs Bharat: ఇష్టం లేకపోతే దేశం విడిచివెళ్ళిపోండి, భారత్ పేరు మార్పు మీద బీజెపీ నేత కీలక వ్యాఖ్య
ఇండియా పేరును భారత్ గా మార్చడం ఇష్టం లేకపోతే దేశం వదిలివెళ్ళిపోండి అంటున్నారు బీజెపీ సీనియర్ నేత దిలీప్ ఘోష్. బెంగాల్ లో తాము అధికారంలోకి వస్తే అక్కడ ఉన్న విదేశీయుల విగ్రహాలను వెంటనే తొలిగిస్తామని చెప్పారు. ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో దిలీప్ ఈ వ్యాఖ్యలను చేశారు.

Translate this News:











