Sleep Anxiety: మార్నింగ్ నిద్రలేచిన దగ్గర నుంచి నైట్ బెడ్ ఎక్కేవరకు చాలా మంది చాలా ప్రశాంతంగా కనిపిస్తారు.. కానీ బెడ్ ఎక్కిన తర్వాత నిమిషమే వారిలో తెలియని ఆందోళన మొదలవుతుంది. కొంచెం భయం భయంగా.. మనకి ఏదో జరుగుతున్నట్టు టెన్షన్ టెన్షన్‌గా అనిపిస్తుంటుంది. ఓవర్ థింకింగ్ అవహించే సమయం అది. ఆ రోజు జరిగిన విషయాలపై ఆందోళన.. రేపు ఏం జరగబోతుందోనన్న ఫీలింగ్‌తో నిద్రపట్టదు. ఇది చాలా రోజులు కంటిన్యూ అవుతూనే ఉంటే మీరు స్లీప్ ఎంగ్జైటీతో బాధపడుతున్నట్టే లెక్క! ఆందోళన, ఒత్తిడి నిద్రపోనివ్వకుండా ఆపుతాయి. ఆందోళన కలిగి ఉండటం నిద్ర సమస్యలను కలిగిస్తుంది.. నిద్ర లేమి కూడా ఆందోళనను రేకెత్తిస్తుంది. మీకు నిద్ర పట్టకపోతే, మీరు పడుకోవడానికి, మేల్కొనడానికి భయపడవచ్చు.
స్లీప్ ఎంగ్జైటీ లక్షణాలు:
Sleep Anxiety: నిద్రలేమితో బాధపడుతున్నారా? ఇలా చేయండి.. హాయిగా బొజ్జుంటారు!
స్లీప్ ఎంగ్జైటీ అన్నది చాలా పెద్ద సమస్య. అనుభవించినవాడికే ఈ సమస్య అర్థమవుతుంది. దీని వల్ల ఏకాగ్రతలో ఇబ్బంది కలుగుతుంది. ఆందోళన పెరుగుతోంది.. జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. బెడ్ టైమ్‌కి ముందు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడం.. పడుకునే ముందు ఓవర్‌గా భోజనం చేయకుండా ఉండడం లాంటివి చిట్కాలుగా పాటించండి.

Translate this News:











