టీడీపీ అధినేత చంద్రబాబుపై ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబు తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ.. కార్యకర్తలను, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతే కాకుండా శాంతి భద్రతలు కాపాడే పోలీస్ అధికారులపై చంద్రబాబు దౌర్జన్యం చేస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. తన కార్యకర్తలతో పోలీసులపై దాడి చేయించారని, పుంగనూరులో టీడీపీ కార్యకర్తల దాడిలో ఓ కానిస్టేబుల్ కంటి చూపు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనికంతటికీ కారణం చంద్రబాబు నాయుడని అంబటి మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..Ambati rambabu: రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కల్గించాలని చూస్తున్నారని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరొపించారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలో తిరుగుతున్న నేతలు ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు అధికారం రాదేమో అనే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.

Translate this News:











