తనపై వస్తున్న తప్పుడు ప్రచారాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి స్పందించారు. తనపై వస్తున్న వార్తలపై ఇటీవలే ప్రెస్మీట్లో క్లారిటీ ఇచ్చానన్నారు. అయినా కొందరు కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కొందరికి ఎదుటి వ్యక్తిని అవమానించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.తాను 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని జగ్గారెడ్డి తెలిపారు. రాజకీయాల్లో అనేక సమస్యలు, ఒడిదొడుకులు వచ్చాయని, వాటన్నింటిని ఎదుర్కొంటూ ఎదిగానని గుర్తు చేశారు. తన అమ్మకు వస్తున్న జీతంతోనే జీవనం కొనసాగించానన్నారు.
పూర్తిగా చదవండి..Jaggareddy: ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు
తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకాలం ఓపిగ్గా ఉన్నానని.. ఇకపై ఓపిక పట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోసారి తనపై తప్పుడు ప్రచారం చేస్తే తన అనుచరులకు అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











