G20 Summit 2023: జీ 20 సదస్సు భారతదేశంలో విజయవంతమైంది. ఢిల్లీలో (Delhi) ని ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగిన ఈ సదస్సులో ప్రపంచం నలుమూలల నుండి ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఇందులో ప్రెసిడెంట్ జో బిడెన్ (Joe Biden), బ్రిటీష్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), ఇటాలియన్ PM జార్జియా మెలోని, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, టర్కీ (Turkey) అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కూడా ఉన్నారు. జీ20 సదస్సును ఘనంగా నిర్వహించడం ద్వారా భారత్ భవిష్యత్తు మనదేనని ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ సదస్సు తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలనే డిమాండ్ పెరగడానికి కారణం ఇదే.
పూర్తిగా చదవండి..G20 Summit: ప్రపంచమంతా భారత్‌కే సపోర్ట్ బ్రో..పాక్ తిక్కకుదిర్చిన టర్కీ..!
భద్రతా మండలిలో ఐదు శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, అమెరికా సందర్భంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఎర్డోగాన్ మాట్లాడుతూ ఈ ఐదు దేశాల కంటే ప్రపంచం చాలా పెద్దదని అన్నారు. అంటే ప్రపంచంలో ఆ ఐదు దేశాలు మాత్రమే కాదు...అంతకంటే శక్తివంతమైన భారత్ వంటి దేశాలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు. జీ 20 సదస్సు ముగిసిన అనంతరం ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోంది. భద్రతామండలిలో భారత్ కు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.

Translate this News:











