Times Now EGT Survey : టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియల్ పోల్ ప్రకారం బీజేపీ (BJP) 300సీట్లకు పైగా విజయం సాధిస్తుందని అంచనా వేయగా… విపక్షాల ఇండియా కూటమి 160-190 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఎన్డీఏ దాదాపు 296-326 సీట్లు సాధించవచ్చని సర్వే అంచనా వేసింది. 2019లో 353 సీట్లు సాధించినప్పటికీ ఈసారి మాత్రం స్వల్పంగా తగ్గే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. రానున్న లోకసబ ఎన్నికల్లో మోదీ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడమే లక్ష్యంగా… ప్రతిపక్షాల పార్టీల ఐక్యత ఇండియా కూటమిని ఏర్పాటు చేసినప్పటికీ..ఎన్డీఏ (NDA)ను ఎదుర్కొనేందుకు కూటమి ప్రయత్నాలన్నీ సరిపోకపోవచ్చని సూచించింది.
పూర్తిగా చదవండి..Times Now Survey : మూడోసారి పీఎం మోదీనే…రాహుల్ పరిస్థితి ఏంటి..?
దేశంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్రమోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం ఖాయమని టైమ్స్ నౌ ఈటీజీ ఒపీనియన్ పోల్ సూచించింది. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు గెలిచే ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టస్తారని సర్వేలో వెల్లడైంది. ఆగస్టు 15 స్వాతంత్రదినోత్సవ ప్రసంగంలో మోదీ...దేశంలో సాధించిన విజయాలే 2024లో మరోసారి అధికారంలోకి తీసుకువస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలను సైతం మోదీ ఆహ్వానించారు.

Translate this News:











