పళ్యాణ్ కళ్యాణ్ మూడో విడత వారాహి విజయ యాత్రం( Varahi Yatra) రేపు విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. వారాహి యాత్ర విజయం కోసం సింహాద్రి అప్పన్న (Simhadri Appanna) కొండపైకి మోకాళ్ళతో మెట్లు ఎక్కిన జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు (గురువారం) ప్రారభమై.. ఈనెల 19 వరకు కొనసాగనుంది. అయితే వారాహి యాత్ర మూడో విడత విజయం సాధించాలని జనసైనికులు సింహాచలం తొలి పావంచ వద్ద 108 కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. మెట్లు మార్గం గుండా మోకాళ్ళతో పైకి ఎక్కి సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శనం చేసుకున్నారు. విశాఖపట్నం యాత్ర దిగ్విజంగా సాగాలని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. అయితే 10 రోజుల పాటు విశాఖలో అనేక అంశాలను పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తావన చేయనున్నారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే పోలీసు శాఖ వారిని అన్ని అనుమతులు కోరినట్లు తెలుస్తోంది. రుషికొండ, ముదపాక, విస్సన్నపేట ప్రాంతాలను సందర్శించిన పవన్ కళ్యాణ్, స్టీల్ ప్లాంట్, గంగవరం, కార్మికుల పోరాటానికి మద్దతు తెలుపనున్నారు.
పూర్తిగా చదవండి..రేపటి నుంచి విశాఖలో వారాహి మూడో దశయాత్ర
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన వారాహి యాత్ర రెండు విడతలు విజయవంతం అయిన విషయం తెలిసిందే. యాత్రను సక్సెస్ ఫుల్‌గా చేసిన నేపథ్యంలో మూడో విడత యాత్రకు సిద్ధమైయ్యారు. రెండు దశలో ఏపీ ప్రభుత్వంపై విరుచుక పడిన పవన్.. ఇప్పడు విశాఖ మూడో వారాహి యాత్రపై వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.. పవన్ కౌంటర్‌కు.. ఏపీ అధికారుల రీకౌంటర్ ఎలా ఉంటుదో ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Translate this News:











