Kushi Movie Twitter review: విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెలలో భారీ అంచనాలున్న సినిమాల్లో ‘ఖుషి’ ఒకటి. విజయ్ ఇంతకుముందు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ సినిమా విజయంపై రౌడి అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ‘ఖుషి’ ప్రమోషన్స్ కూడా అదరగొట్టాయి.
‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. ఇక ‘ఖుషి’ బెనిఫిట్ షోల తర్వాత ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా తమ రివ్యూ చెబుతున్నారు.
Kushi: విజయ్-సమంత కెమిస్ట్రీ అదిరింది భయ్యా.. ‘ఖుషి’ ట్విట్టర్ రివ్యూ!
విజయ్-సమంత నటించిన 'ఖుషి' సినిమా ట్విట్టర్ రివ్యూ అదిరింది. విజయ్-సమంత కెమిస్ట్రీ స్క్రీన్‌పై అదిరిందని.. ఫీల్ గుడ్ మూవీ చూశామన్న భావన కలుగుతుందని ఫ్యాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. అటు సాంగ్స్ కూడా స్క్రీన్‌పై చాలా బాగున్నాయంటున్నారు అభిమానులు. మరికొందరు మాత్రం స్టోరీ స్లో నేరషన్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి మంచి చిత్రాలు అందించిన శివ నిర్వాణ.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Translate this News:











